header

Babar…బాబర్...

Babar…బాబర్...
భారతదేశంలో మొగల్ సామ్రాజ్యానికి పునాది వేసినవాడు బాబర్. ఇతని తల్లివైపు వారు ప్రపంచంలోనే అత్యంత క్రూరుడుగా పేరుపొందిన చెంఘీజ్ ఖాన్ వంశానికి చెందినవారు. తండ్రి వైపువారు తైమూర్ వారసులకు చెందినవారు.
బాబర్ చిన్నతనంలోనే సామర్కండ్ రాజై తన ప్రతిభతో తన సామ్రాజ్యాన్ని కాందహార్ వరకు వ్యాపింపచేశాడు.
అప్పటికి భారతదేశాన్ని ఇబ్రహీం లోడి పరిపాలిస్తున్నాడు. అప్పటి పంజాబ్ గవర్నర్ దౌలత్ ఖాన్ ఇబ్రహింలోడీ మీద తిరుగుబాటు ప్రకటించి బాబర్ ను భారతదేశానికి ఆహ్వానిస్తాడు. బాబర్ తన సైన్యంతో భారతదేశంలోకి ప్రవేశించి పానిపట్ వద్ద ఇబ్రహిం లోడీతో తలపడతాడు. యుద్ధంలో ఇబ్రహింలోడిని జయించి భారతదేశంలో మొగల్ సామ్రాజ్య స్థాపనకు పునాదివేస్తాడు.
1527 సం.లో రాజపుత్రులను యుద్ధంలో ఒడించి మొగల్ సామ్రాజ్యాన్ని పటిష్టం చేస్తాడు. ఆఫ్ ఘన్ వజీర్లను 1529 సం.లో ఓడిస్తాడు.
బెంగాల్ నవాబుతో సంధిచేసుకుని తన రాజ్యాన్ని బీహార్ వరకు విస్తరింప చేస్తాడు.
బాబర్ సహజంగా కళాపోషకుడు. పండితులను, విద్యాంసులను, కళాకారులను తన ఆస్థానానినికి పిలిపించి సత్కరించేవాడు. ఇతని కాలంలోనే ఇతని చరిత్ర బాబర్ నామా వ్రాయబడ్డది.
1530 సం.లో ఆగ్రాలోని తన రాజప్రసాదంలో మరణించాడు. ఇతని తరువాత ఇతని కుమారుడు హుమయున్ రాజ్యాధికారం చేపట్టాడు.